10th Class - టెన్త్ పరీక్షలు రోజు మార్చి రోజు ప్రభుత్వానికి ప్రతిపాదనలు
టెన్త్ పరీక్షలు రోజు మార్చి రోజు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఒంగోలు (విద్య), డిసెంబరు 27: పదో తరగతి పబ్లికపరీక్షలను రోజు మార్చి రోజు నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి. దేవానందరెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ సీబీఎస్ఈ విధానం అమలు క్రమంలో భాగంగా ఈ సంవత్సరం నుంచి పదోతరగతిలో ఆరు పేపర్లు ఉన్నాయని చెప్పారు. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రోజు మార్చి రోజు జరుగుతాయని, ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేయనున్నారు. ప్రతి సబ్జెక్టుకు ఒక పేపరు ఉంటుంది. జనరల్సైనై పీఎస్లో 16ప్రశ్నలు, ఎన్ఎస్లో 17ప్రశ్నలు ఉంటాయి. మొదటి పీఎస్ తర్వాత ఎన్ఎస్ పరీక్ష రాయాలి. పరీక్షలకు సంబంధించి ఆన్లైన్లో సమర్పించిన నామినల్ రోల్స్ కానీ, అప్లికేషన్ను గాని ప్రామాణికంగా తీసుకుంటారు. మాన్యు వల్ నామినల్ రోల్ కూడా తప్పనిసరి. దీనిని భవిష్యత్ ఆధారం కోస ఆఫీసులో రికార్డు నిర్వహణకు అవసరం కాబట్టి కచ్చితంగా నామినల్ రోల్ పంపాలి. నామినల్ రోల్ను పోస్టు ద్వారా గాని తపాల ద్వారా గాని డీఈవో కార్యాలయానికి పంపాలి. డీసీఈబీకి చెల్లించిన విరాళం రసీదు ఉప విద్యాధికారి కౌంటర్ సంతకం అవసరం లేదని, సీఎఫ్ఎం ఎస్ ద్వారా పరీక్ష ఫీజు ఎవరైనా చెల్లించి ఉంటే దానిని కూడా పరిగ ణనలోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
No comments