తెరుచుకున్న బడులు- హాజరు అంతంత మాత్రమే

  *📚✍️తెరుచుకున్న బడులు♦️హాజరు అంతంత మాత్రమే♦️కొనసాగుతున్న జేవీకే కిట్ల పంపిణీ♦️విలీనం వద్దంటూ పలు చోట్ల నిరసనలు

🌻అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సుదీర్ఘమైన వేసవి సెలవుల తర్వాత పాఠశాలలకు విద్యార్థుల రాక మొదలైంది. అయితే తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అంతంత మాత్రంగానే హాజరు నమోదైనట్లు తెలుస్తోంది. బుధవారం నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబు తున్నారు. మరోవైపు ఈ ఏడాది నుంచి నూతన విద్యా విధానం అమలు కాబోతోంది. గతంలో మాదిరి కాకుండా ఆరు అంచెల విద్యావిధానంతో విద్యా సంవత్సరం కొనసా గనుంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల 3, 4, 5 తరగతుల విలీ నాన్ని నిలిపివేయాలంటూ నిరసననలు, అభ్యంతరాలు వ్యక్త మయ్యాయి. మరోవైపు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిం చారు. ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ కిట్లను అందజేస్తారు. ఈ కిట్లలో మూడు జతల యూని ఫాం, బెల్టు, బూట్లు, సాక్సులు, స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలు ఉంటాయి. కిట్లలభ్య త, అందుబాటులో ఉన్న సంఖ్యను బట్టి రోజుకు ఒక్కో పాఠ శాలలో కనీసం 40 మందికి చొప్పున నెలాఖరు వరకు అందజేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అనంతపురం జిల్లా చెలిమేపల్లి గ్రామంలోని పాఠశాల వద్ద మెర్జింగ్ వద్దంటూ స్థానికులు ఉపాధ్యాయులను పాఠశాల నుంచి అడ్డుగా ముళ్ల కంపలు వేసి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో నేసేపేట ప్రాథమిక పాఠశాలను మ్యాపింగ్ చేయ వద్దని కోరుతూ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. అలాగే పలు జిల్లాల్లో పాఠశాలల మ్యాపింగ్, మెర్జింగ్కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

♦️3, 4, 5 తరగతులు విలీనం అయోమయం: టీఎన్ యూఎస్

3,4,5 విలీనం అయోమయంగా ఉందని, విలీ న ఉత్తర్వులు అర్ధరాత్రి ఇవ్వడంపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వారం రోజులుగా పాఠశాలల్లో సంసిద్ధత కార్యక్రమాలు జరుగుతుంటే విలీ నంపై పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను సంసి ద్దులను చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీఎన్ యూఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్ధిక కార్యదర్శి పినాకపాణి అభిప్రాయం వ్యక్తం చేశారు.విలీనంపై తల్లి దండ్రుల అభిప్రాయ సేకరణ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో నమోదు నిమిత్తం లేకుండా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని, లేకుంటే కొత్తగా పెట్టబోయే ఫౌండేషన్ పాఠశాలలలో గుణాత్మక విద్య అందదని, ఇది విద్యాభివృద్ధికి తిరోగమనం అవుతుందని సంఘ ప్రతి నిధులు శేషుఫణి రాజు, బెంగు ళూరు రమేష్, కె. రామ లింగప్ప, బజారన్న, సాంబశివారెడ్డి, ఓబులేష్, బండారు హరీష్ అన్నారు.



No comments

Powered by Blogger.