బలవంతపు విలీనం దేనికి ? - టీ ఎన్ యూ ఎస్.
బలవంతపు విలీనం దేనికి ? - టీ ఎన్ యూ ఎస్.
జాతీయ విద్యా విధానంలో ఎక్కడ కూడా పాఠశాలలు విలీనం చేయమని పిల్లలలను కిలోమీటర్లు కొద్దీ నడిపించమని చెప్పఁలేదు అని... కానీ ఏపి లో 3,4,5 తరగతుల విలీనం తో తమ ఇంటి దగ్గర ఉన్న బడి నుంచి రక్షణ లేని స్థితిలో చిన్నారులు రోడ్లు , పొలాలు, కాలువలు దాటి దూరం గా నడిచి వెళ్ళవలసిన ప్రమాదకరమైన పరిస్థితి వచ్చిందని ...
చదువుకొనే పిల్లలకు , తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు కి ఇష్టం లేని *బలవంతపు విలీనం దేనికి అని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శలు మన్నం శ్రీనివాస్ , శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు* ఒక ప్రకటన లో ప్రశ్నించారు.
అలాగే మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అమలు చేయాలని జాతీయ విద్యా విధానంలో చట్టం చేయడం జరిగింది. కానీ ఇక్కడ భిన్నంగా అమలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ,చిన్న పిల్లలు తమ ఊరి బడి కోసం చేస్తున్న ఆందోళనలు గమనించి విలీనం పై పునరాలోచన చేసి విలీనం ఆపాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు పినాక పాణి , నారాయణరెడ్డి , బెంగుళూరు రమేష్ , చెరుకూరి పూర్ణ చంద్ర రావు,బండారు హరీష్ ,ఆర్.కాశీ నాధ్ , జంపని ఆంజనేయులు, బజారన్న, ఒక ప్రకటన లో కోరారు.
No comments