Edn Minister Botsa Satyanarayana comments on unions
✍️బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ ఉద్యోగ సంఘాలు
🌻ఈనాడు, అమరావతి*: ఉద్యోగ సంఘాల నేతలకు అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలని, ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తగదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఉద్యోగులు ఉద్యమాలు సాగించి మాత్రమే సౌకర్యాలు, జీతాలు పొందుతున్నారే తప్ప ఏ పాలకుడి కాళ్లు పట్టుకుని పొందలేదన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నాయి.
♦️హక్కుల సాధనకే సంఘాలు
మంత్రి బొత్స వ్యాఖ్యలు ఆయన భూస్వామ్య అహంకార మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు పెట్టుకునేది హక్కుల సాధనకే. పోరాటాలు చేసి సాధించుకోవడమే తప్ప కాళ్లు పట్టుకోవడానికి కాదని గ్రహించాలి.
▪️షేక్‌సాబ్జీ, ఎమ్మెల్సీ
♦️వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం
మంత్రి బొత్స తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలకు వెనుకాడబోం. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి.
▪️తిమ్మన్న, ప్రధాన కార్యదర్శి, రాష్ట్రోపాధ్యాయ సంఘం
♦️ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అశాంతి
సమస్యలు సృష్టించి, ఉన్న ప్రయోజనాలు తొలగిస్తున్నందుకు ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అశాంతితో ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం.
ల▪️హృదయరాజు, చిరంజీవి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీటీఎఫ్(1987)
♦️చిన్నచూపు తగదు
ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులే కనుక సమస్యలు పరిష్కారానికి వారు కూడా కాళ్లు పట్టుకోవాలని సందేశం ఇస్తున్నారా? ఉద్యోగుల పట్ల ఇంత చిన్నచూపు, వ్యతిరేకత ప్రదర్శించడాన్ని మానుకోవాలి.
▪️మంజుల, భానుమూర్తి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీటీఎఫ్
♦️అలా మాట్లాడటం భావ్యం కాదు
పీఆర్సీ, ఐదు డీఏలు సక్రమంగా ఇవ్వకున్నా, ఉద్యోగులు దాచుకున్న డబ్బుని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నా ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారు. ఉద్యోగులను ఇలా తక్కువ చేసిన మాట్లాడటం భావ్యం కాదు.
*▪️మన్నం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం*
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
✍️మంత్రి బొత్స వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
♦️అవమానకర వ్యాఖ్యలు ఉపసంహించుకోవాలని డిమాండ్
🌻అమరావతి,ఆంధ్రప్రభ: సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు అవసరమైతే మంత్రులు, అధికారుల కాళ్లు పట్టుకోనైనా సాధించుకోవాలంటూ విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారయణ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమౌతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ఈ వ్యాఖ్యలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను అవమానించడమేనని అంటున్నాయి. మంత్రి బొత్స తక్షణ తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
♦️మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం:ఎస్టియు
రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు అవసరమైతే మంత్రుల కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తక్షణం ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు వెనుకాడమని రాష్ట్రాప్రాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న తెలియజేశారు.
♦️వ్యాఖ్యలను ఉపసంహిరించుకోవాలి : ఎపిటిఎఫ్
ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ధర్నాలు, రాస్తారోకో, పోరాటాలు చేయడం తగదని, సమస్యల పరిష్కారానికి అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలని విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం సరికాదని ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, యస్. చిరంజీవి అన్నారు. సుదీర్ఘ పోరాట చరిత్ర గల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలను కించపరిచి, అవమానించే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
♦️మంత్రి వ్యాఖ్యలు అవమానకరం: టిఎన్ యూ ఎస్
ఒక సీనియర్ నాయకునిగా, సీనియర్ మంత్రిగా ఎంతో అనుభవం ఉన్న బొత్స సత్యనా రాయణ ఉద్యోగ సంఘాల ను, సంఘ నాయకులను తక్కువ చేసేలా, అవమానించేలా మాట్లా డటం తగదని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు తమ పిఫ్ అమౌంట్ లో దాచుకున్న డబ్బు ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ కం ట్రోల్ లోనే ఉన్నామని బహిరంగంగా ప్రెస్ మీటింగ్ లలోనే ఒప్పుకుంటున్నా, ప్రభు త్వానికి సహకారం అందిస్తున్నా కూడా ఇలా తక్కువ చేయడం భావ్యము కాదని వారు అన్నారు.
✍️అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి
♦️ధర్నాలు, రాస్తారోకోలు తగదు
♦️సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స సూచన
*🌻ఈనాడు డిజిటల్, అమరావతి:* ‘సమస్యల పరిష్కారానికి సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించడం సహజమైనా... ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి దిగుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తగదు. మా దృష్టిలో ప్రభుత్వం, ఉద్యోగులు రెండూ వేరువేరు కాదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి’ అని ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రథమ మహాజన సభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడారు. ‘సమస్యలు, హక్కులపై పోరాడటంలో తప్పు లేదుగానీ బాధ్యతలను మరచిపోరాదు. ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు కళ్లు, చెవుల్లాంటి వారు. ప్రభుత్వంలో ఎక్కడైనా అవినీతి జరిగితే.. ఉద్యోగులు, సీఎం తలదించుకోవాలి. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేరు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తాం’ అని పేర్కొన్నారు.
*♦️సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం కావు*
‘అన్ని సమస్యలూ ఒక్క రోజులో పరిష్కారం కావు. సచివాలయ పోలీసు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పాఠశాలలను తనిఖీ చేసేలా ఆదేశాలిస్తాం. శానిటేషన్ ఉద్యోగులకు త్వరలో వారాంతపు సెలవు ప్రకటిస్తాం. పదోన్నతులు, సర్వీస్ రూల్స్‌కు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాం’ అని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సచివాలయాల ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సర్వీస్‌రూల్స్, పదోన్నతులు, బదిలీలు, ప్రొబేషన్ ప్రకటనలో జాప్యంవల్ల సమస్యలు, పని ఒత్తిడి, భద్రతాపరమైన ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి సంఘ నేతలు తీసుకెళ్లారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
*♦️బొత్స అసహనం:* కార్యక్రమం సుదీర్ఘంగా సాగడంపై బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. కొత్త కార్యవర్గం తమ సమస్యలను వివరిస్తుండగా ‘సభలో నీకు మైకిస్తే నీ ఇష్టం వచ్చినట్టు.. నాకు మైకిస్తే నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం’ అని వ్యాఖ్యానించారు. ‘సమస్యను పక్కదారి పట్టించడం, దానిని మర్చిపోయేలా చేయడంలో సమర్థులు’ అని మంత్రి బొత్సను ఉద్దేశించి బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.
No comments