GO.117 సవరణ చేయాలి టీఎన్ యూఎస్

  ✍️జీవో 117 సవరణ చేయాలి

♦️టీఎన్ యూఎస్

*🌻అమరావతి, ఆంధ్రప్రభ*:రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 117ను సవరించిన తరువాతనే ఉపాధ్యాయుల సర్దుబాట్ల ప్రక్రియను చేపట్టాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్ యూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఒక ప్రకటనలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:20గా ఉండాలని లేని పక్షంలో అన్ని పాఠశాలలు సింగల్ టీచర్ స్కూల్స్ గా మారిపోయి, మితిమీరిన యాప్ల భారంతో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు న్యాయం చేయలేక, నాణ్యమైన విద్య అందక కొత్తగా చేపడుతున్న ఫౌండేషన్ పాఠశాలల్లోనే ప్రాథమిక విద్య ఫౌండేషన్ లేకుండా పోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హైస్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు 36 పీరియడ్ల కు మించి బోధన ఇవ్వవద్దని, లేదంటే ఉపాధ్యాయలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. నాడు - నేడు కార్యక్రమంలో ఇసుక, కట్టడ పు పనులు మొత్తం ఉపాధ్యాయులపై పెట్టడం వల్ల అనేక ఇబ్బందులకి గురవుతున్నారని, ఆ భారాన్ని తప్పించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నేతలు శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు, పినాకపాణి, రామలింగప్ప, మొక్కపాటి రాంబాబు, చెరుకూరి పూర్ణ చంద్రరావు,కోరారు.

♦️ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయొద్దు: అప్తా

*🌻అమరావతి ఆంధ్రప్రభ:* ప్రభుత్వం అమల్లోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమబద్ధీకరణ జీవో నెంబర్ 117 ప్రాథమిక స్థాయిలో విద్యాబోధనను చాలా దారుణంగా దెబ్బతీసే విధంగా ఉందని, దీనిపై రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకతను వెలిబుచ్చినప్పటికీ అధికార యంత్రాంగం ముందుకు వెళుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు, కె. ప్రకాశరావు అన్నారు. గతంలో 1:20 పద్ధతిలో ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని ప్రస్తుతం 1:30గా మార్చడంతో ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోతున్నాయని, అందువల్ల ప్రాథమిక విద్యలో నాణ్యత దెబ్బతిని విద్యార్ధులు ప్రైవేట్ స్కూళ్ల వైపు వెళ్లే ప్రమాదం పొంచి ఉందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలను విడగొట్టి ఒకటి రెండు తరగతులలో బోధ నకు ఒకే ఉపాధ్యాయుని కేటాయించడం దారుణమన్నారు. క్రమబద్ధీకరణ పేరుతో నిష్పత్తిలో మార్పు చేసి పూర్తిస్థాయిలో మానవ వనరులను తగ్గించేసి, ప్రాథమిక విద్యను తిరోగమన మార్గంలోకి తీసుకెళ్తున్నారన్నారు. కనుక ప్రాథమిక స్థాయిలో 1:20 నిష్పత్తిని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కడా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

No comments

Powered by Blogger.