Pending bills చెల్లించాలి - టి ఎన్ యూ ఎస్

 పెండింగ్ బిల్లులు చెల్లించాలి - టి ఎన్ యూ ఎస్

 ఉపాధ్యాయుల పీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎర్న్ లీవ్ అమౌంట్స్ కి సంబంధించిన  బిల్లులు ఎంతో కాలం గా  పెండింగ్లో ఉన్నాయని, దీంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని కావున పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం  అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు మన్నం శ్రీనివాస్ , శ్రీ రామ శెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేసారు.

15 రోజుల్లో రావాల్సిన భవిష్య నిధి  రుణం మంజూరు కి ఒక సంవత్సరం వరకు టైం తీసుకోవడం శోచనీయమన్నారు. ఫైనల్ పేమెంట్లు, రుణాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. 

కుటుంబ అవసరాలు కి, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యానికి ఇబ్బందులు పడుతూ వాయిదా వేసుకుంటున్న పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని  తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు పినాక పాణి, బెంగుళూరు రమేష్ , కె.రామ లింగప్ప,సాంబశివా రెడ్డి,  యుగంధరాచారి , మోతుకురి రవీంద్ర , బండారు హరీష్,  ఎన్ . రమణయ్య ఒక ప్రకటన లో కోరారు




No comments

Powered by Blogger.