PF Amounts - ఉద్యోగుల ఖాతాల్లో నగదు ఏమైంది?.. ఇంకా స్పష్టత ఇవ్వని ఆర్థికశాఖ
Flash news...
నేడు PRC కేసు సందర్భంగా ఉద్యోగుల జిపిఎఫ్ అకౌంట్ల నుండి నగదు రికవరీలపై హైకోర్టుకు నివేదన - మద్యంతర ఉత్తర్వులు
పి ఆర్ సి(PRC) ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ అధికారుల జేఏసీ ., చైర్మన్ కే.వి.కృష్ణయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై నేడు వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది రవి తేజ పదిరి.
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తమ పిటీషనర్ తో సహా అనేక మంది ఉద్యోగుల జి.పి.ఎఫ్ (GPF) ఖాతాల నుంచి సొమ్ము రికవరీ చేశారని పేర్కొన్న న్యాయవాది రవి తేజ.
గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచి వాదనల అనంతరం ఆ మొత్తం విషయాలను తెలియ చేస్తూ అఫిడవట్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం.
కోర్టు ఆదేశాలను దిక్కరించినందున వారికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టం క్రింద నోటీసులు ఇస్తుందిని కోర్టు ఆదేశం.
తదుపరి వాదనలు రెండు వారాలకు వాయిదా.
ఉద్యోగుల ఖాతాల్లో నగదు ఏమైంది?.. ఇంకా స్పష్టత ఇవ్వని ఆర్థికశాఖ..
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ అధికారులను కలిసినా స్పష్టత రాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఇవాళ ఉదయం సచివాలయంలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్, సత్యనారాయణను జెఏసి నేతలు కలిసి సమస్యను వివరించారు. జీపీఎఫ్ ఖాతా నుంచి ఉద్యోగుల అనుమతి లేకుండా నగదు విత్‌డ్రా ఎలా జరిగిందని ప్రశ్నించారు.
ఎలా జరిగిందో తమకు కూడా తెలియడం లేదని, విచారణ జరిపి స్పష్టత ఇస్తామని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్టు సమాచారం. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామని, క్రింది స్థాయి అధికారులు నుంచి నివేదిక తెప్పించుకుని సమస్యను పరిష్కరిస్తామని ఆర్థికశాఖ అధికారులు హామీ ఇచ్చారని జేఏసీ నేతలు వెల్లడించారు. సాయంత్రంలోగా అన్ని విషయాలపై స్పష్టత ఇస్తామని చెప్పారని తెలిపారు. జీపీఎఫ్ ఖాతాల్లో నగదు వేయడం, తీయడంపై సీఎఫ్‌ఎంఎస్‌లో సాంకేతికలోపం కూడా కారణం కావచ్చని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
పి ఎఫ్ ఖాతాల నుంచి 800 కోట్లు విత్ డ్రా సమంజసం కాదు -TNUS
ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి దాదాపు 800 కోట్ల రూపాయలు ఉద్యోగులకు తెలియకుండా విత్ డ్రా చేయడం సమంజసం కాదని ఆందోళన కలిగించే విషయం అని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్ , శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు , తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు పినాక పాణి, పూర్ణ చంద్రరావు, బెంగుళూర్ రమేష్, రామలింగప్ప, హరీష్ , మొక్కపాటి రాంబాబు, శేషుఫణి రాజు విచారం వ్యక్తం చేసారు.
15 రోజుల్లో రావాల్సిన భవిష్య నిధి రుణం నెలలు పట్టడం శోచనీయమన్నారు. ఫైనల్ పేమెంట్లు, రుణాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు.
కుటుంబ అవసరాలు కి పెళ్లిళ్లు, వైద్యానికి ఇబ్బందులు పడుతూ వాయిదా వేసుకుంటున్న పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. పొదుపులు చేసుకోవడం కూడా శాపంగా మారిందన్నారు.
No comments