Retirement రిటైర్మెంట్ పై స్పష్టతనివ్వాలి: టీఎన్ యూఎస్
✍️రిటైర్మెంట్ పై స్పష్టతనివ్వాలి: టీఎన్ యూఎస్
🌻అమరావతి, ఆంధ్రప్రభ*: రాష్ట్ర ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకి ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో గురుకులాల ఉద్యోగుల విషయంలో ఉత్తర్వుల్లో స్పష్టత లేక ఉద్యోగం చేయాలో.. ఇంట్లో ఉండాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆందోళన వెలిబుచ్చింది. గురుకులాలకు చెందిన అనేక మంది ఉద్యోగులు పెన్షన్ ప్రపోజల్ పెట్టుకోవాలో, ఉద్యోగ నిర్వహణకి వెళ్లాలో తెలియక త్రిశంకు స్వర్గంలో ఉన్నారని, వారి విషయంలో 62 సంవత్సరాల ఉత్తర్వులులో స్పష్టత వెంటనే వచ్చేలా చేయా లని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్ధిక కార్యదర్శి పినాక పాణి ప్రతినిధులు బెంగుళూరు రమేష్, తలశిల శ్రీనివా సరావు, చెరుకూరి పూర్ణచంద్రరావు, నామాల కృష్ణమోహన్, ఎం.వి శేషు ఫణిరాజు, బండారు హరీష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
No comments