Show causes To teachers - ఉపాధ్యాయులపై కక్షసాధింపు ♦️శ్రీకాకుళంలో 621మందికి ఒకేసారి షోకాజ్‌ నోటీసులు

 ✍️ఉపాధ్యాయులపై కక్షసాధింపు

♦️శ్రీకాకుళంలో 621మందికి ఒకేసారి షోకాజ్‌ నోటీసులు

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం - టి ఎన్ యు ఎస్ #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham #TNUS #టీఎన్‌యూఎస్ #Noble Teachers Association #NTA#నోబుల్ టీచర్స్ అసోసియేషన్


🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందా? తాజా పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పాఠశాలల్లో బోధనేతర పనుల సమాచారాన్ని సకాలంలో యాప్‌లలో నమోదు చేయలేదని పేర్కొంటూ విద్యాశాఖ పెద్ద సంఖ్యలో షోకాజ్‌ నోటీసులు జారీ చేయడమే దీనికి కారణం. గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,000 మంది ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ షోకాజ్‌ నోటీసులు ఇచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. విద్యార్థుల హాజరును 10.30లోపు నమోదు చేయలేదని శ్రీకాకుళం జిల్లా డిఇఓ శుక్రవారం ఒక్కరోజే 621 మంది హెచ్‌ఎంలకు నోటీసులు జారీ చేశారు. కర్నూలు జిల్లా డిఇవో గురువారం 280 మంది హెచ్‌ఎంలకు, ప్రకాశం జిల్లా డిఇవో 15 మంది హెచ్‌ఎంలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వెలుగులోకి రాకుండా చాలా మందికి విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. సాధారణంగా ముందస్తు హెచ్చరికగా అధికారులు మెమోలు జారీ చేస్తారు. అలా కాకండా ఒకేసారి చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. బెదిరింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. పాఠశాలల విలీనాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తుండటంతో విద్యాశాఖ కకక్షపూరితంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మండిపడుతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం బోధనేతర పనులను ఉపాధ్యాయులకుఅప్పగించకూడదు. ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ వ్యవహరిస్తుండటం గమనార్హం. .ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయుడు మరుగుదొడ్ల ఫోటోలు, మధ్యాహ్నం భోజనం పథకం వివరాలు, విద్యార్థుల, ఉపాధ్యాయుల అటెండన్స్‌, జెవికె కిట్లు, చిక్కీలు, కోడిగుడ్లు వంటి ప్రతి సమాచారనిు యాప్‌లలో అప్‌లోడ్‌ చేయాలి. ఉదయం 10.30 గంటల లోపు విద్యార్థుల హాజరు నమోదు చేయాలనిపాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

♦️బెదిరింపు ధోరణులు మానుకోవాలి: ఉపాధ్యాయ సంఘాలు

షోకాజ్‌ల పేరుతో పాఠశాల విద్యాశాఖ బెదిరింపు ధోరణలు మానుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అనాురు. యాప్‌ల పేరుతో ఉపాధ్యాయులకు బోధనేతర పనులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడానిు ఆయన తీవ్రంగా ఖండించారు. . బోధనేతర పనులను తగ్గిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీనినిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కిందిస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోకుండా చర్యలకు పాల్పడటం సరికాదని ఎపి ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు జి నారాయణ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలని టిఎన్‌యుఎస్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు కోరారు.


🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

No comments

Powered by Blogger.