Transfers @ Court - బదిలీల పై నేటి హై కోర్టు లో విచారణ.... ఉత్తర్వుల వివరాలు....
♻️బదిలీల పై కోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో 4 వ తేదీ వరకు ఫైనల్ సీనియార్టీ లిస్ట్ ల విడుదల అనేది ఉండదు.
👉బదిలీలు మరియు రేషనలైజేషన్ కేసుల విచారణ జనవరి 4 కు వాయిదా వేసిన గౌరవ హైకోర్టు.పిటీషన్లు అన్నింటిలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు.పిటిషనర్ల న్యాయ పరమైన సమస్యలన్నీ అధికారులు పరిష్కరించాలని గౌరవ హైకోర్టు ఆదేశాలు.
👉8 సంవత్సరాలు పూర్తి కాకుండా రేషనలైజేషన్ అవుతున్న ఉపాధ్యాయులందరికీ స్టేషన్ పాయింట్లు కేటాయింపు చేయాలని గౌరవ హైకోర్టు అభిప్రాయపడింది.స్పౌజ్ కేటగిరీ,ప్రిఫరెన్షియల్ కేటగిరీ రేషనలైజేషన్ అయిన వారికి అమలు చేసి తీరాలని హైకోర్టు పేర్కొంది.
👉డిపెండెంట్ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ప్రిపరెన్షియల్ కేటగిరీ ని నిరాకరించడం సరైన చర్య కాదని హైకోర్టు అభిప్రాయపడింది.
👉కౌంటర్లు దాఖలు చేయాలని, అధికారులు సమస్యలన్నింటినీ పరిష్కరించాలని హైకోర్టు సూచన చేసింది.
👉బదిలీల ప్రక్రియ స్టేజ్ 4 అంటే ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ వరకే పరిమితం కావాలని గౌరవ హైకోర్టు ఆదేశించింది.
No comments