Transfers info - ఉపాధ్యాయ జాబితాలు సిద్ధం! బదిలీలకు అనుగుణంగా ఖాళీలు మిగిలినవి బ్లాక్‌ చేసే యోచన

  Transfers info - ఉపాధ్యాయ జాబితాలు సిద్ధం!

బదిలీలకు అనుగుణంగా ఖాళీలు

మిగిలినవి బ్లాక్‌ చేసే యోచన

ఈనాడు-అమరావతి: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కచ్చితంగా ఎంతమంది బదిలీ అవుతారో ఆ మేరకు ఖాళీలు చూపించి మిగిలినవి బ్లాక్‌ చేసేలా విద్యాశాఖ యంత్రాంగం కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది.
బదిలీ మార్గదర్శకాలపై కొందరు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన కేసుపై వచ్చేనెల 4న విచారణ జరగనుంది. కేసుతో సంబంధం లేకుండా బదిలీల నిర్వహణకు అవసరమైన కసరత్తు మొత్తం పూర్తి చేశామని, ఈ జాబితాలను కమిషనరేట్‌కు శుక్రవారం పంపుతామని శాఖవర్గాలు పేర్కొన్నాయి. ఉమ్మడి జిల్లాలో 6 వేలమంది వరకు బదిలీ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో కచ్చితంగా బదిలీ అయ్యేవారు సుమారు 2 వేల మంది ఉంటారని అంచనా. మరికొందరు హేతుబద్ధీకరణ, ఇంకొందరు విలీనం ద్వారా బదిలీ అవుతారని చెబుతున్నారు. ఖాళీలు మొత్తం చూపించకుండా కేవలం బదిలీ అయ్యే వారి సంఖ్యకు అనుగుణంగానే చూపితే అంతిమంగా ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని సంఘాల నాయకులు అంటున్నారు. ఖాళీలు ప్రదర్శిస్తే వెంటనే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని, అప్పటికప్పుడు ఖాళీల వివరాలు తెలుసుకుని ఐచ్ఛికాలు ఇచ్చుకోవటానికి సమయం సరిపోదని భావించి ముందుగానే . సంక్రాంతి సెలవులు అనంతరం తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని తొలుత అనుకున్నా, ప్రస్తుతం కోర్టు తీర్పుకు లోబడి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో దీని నిర్వహణకు ఇంకెంత సమయం పడుతుందోనని ఉత్కంఠలో ఉన్నారు. డిసెంబరు నాటికి సిలబస్‌ పూర్తి చేసి పది విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాల్సి ఉన్నా చాలా పాఠశాలల్లో ఇంకా సిలబస్‌ పూర్తికాలేదు. ఇప్పటికైనా బదిలీల ప్రక్రియకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని ఉపాధ్యాయవర్గం కోరుతోంది.



No comments

Powered by Blogger.