tnus.org | Telugunadu Upadhyaya Sangham Andhra Pradesh
Softwares

Promotion Pay Fixation 22a(i), 22B Details, Bill Software

Promotion Pay Fixation 22a(i), 22B Details, Bill Software Teachers Promotion Fixation Software foe Bill Preparation PRC 2022 Download DDO Proceeding letter Under 22a(i), 22B GO for SA / HM Promotion
 
Promotion Pay Fixation 22a(i), 22B Details, Bill Software ప్రమోషన్ పొందిన సందర్భంలో వేతన స్థిరీకరణ:
 
ఎఫ్ ఆర్ 22 బి ప్రాధాన్యత గురించి… వివరణ
 
    25.12.1982 తదుపరి అదనపు బాధ్యతలు గల పోస్టు నందు నియమించబడిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. 1992, 1998 పిఆర్సీ స్కేళ్ళలో 8సంవత్సరాల స్కేలు పొందకుండానే ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం, 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22ఎ(1)ప్రకారం వేతన స్థిరీకరణ చేయబడేది.
       2005 పిఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమాటిక్ అడ్వాన్మెంట్ స్కీమ్ జివో 241 ఆర్థిక తేదీ: 28-09-2005 ద్వారా 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి కూడా ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకణలో రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. 2010, 2015 వేతన స్కేళ్లలో ఆర్డినరీ 6/12/18 స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది.
    దీని ప్రకారం క్రింది పోస్టులో వేతనమునకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం ఆధారంగా పై పోస్టు యొక్క స్కేలులోని తదుపరి స్థిరీకరణ వేతన స్థిరీకరణ చేయబడుతుంది.
    ఈ నిబంధన ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.
1. ‘వాస్తవ ప్రమోషన్’ తేదీ నాడు గానీ లేదా
2. క్రిందిపోస్టులోని తదుపరి ‘ఇంక్రిమెంట్’  తేదీ నాడు గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును.
       జివో ఎంఎస్ నెం. 145, ఆర్థిక తేదీ: 19.05.2009 ప్రకారం ఉద్యోగికి లాభదాయకంగా ఉండే విధానంలో  పైరెండింటిలో దేనిప్రకారం అయిన ఉద్యోగి ఆప్షన్ తో పనిలేకుండానే వేతన నిర్ణయం చేసేబాధ్యత డ్రాయింగ్ అధికారికి కల్పించబడింది.
ఉదాహరణ: అక్టోబర్ నెల ఇంక్రిమెంట్ తేదీగా గల *యస్వీ. యన్.ఆర్* అనే ఉపాధ్యాయుడు తేదీ: 06.07.2019న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినాడు.  తేదీనాటికి అతని వేతనం రూ.28940 – 78910 స్కేలులో రూ.44870/-లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం రెండు విధాలుగా స్థిరీకరించవచ్చు.
ప్రమోషన్ తేదీనాడు వేతన స్థిరీకరణ:
 
1. తేదీ: 06-07-2019 నాటికి ఎస్జిటి పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 44,870/-స్కేలు 28940 – 78910
2. ఎఫ్ ఆర్ 22 బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు :రూ, 46060/- స్కేలు 28940 – 78910
3. స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,47330/- స్కేలు 28940 – 78910
4. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.07.2020
 ఇంక్రిమెంట్ తేదీ ప్రమోషన్ తేదీకి అంటే జులై నెలకు మారుతుంది.
క్రింది పోస్టులోని ఇంక్రిమెంట్ తేదీనాడు వేతన స్థిరీకరణ:
 
 
1. తేదీ 03.07.2019 నాటికి ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ, 44,870/- స్కేలు 28940-78910
2. పదోన్నతి పొందిన రోజున ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం వేతన నిర్ణయం: రూ, 46060 స్కేలు 28940-78910
3. తేదీ 01.10.2019న ఎస్జిటి పోస్టులో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు: రూ, 47,330 స్కేలు 28940 – 78910
4. ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు(10/19)న:  రూ, 47330/- స్కేలు 28940 – 78910
5. స్కూల్ అసిస్టెంట్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం(10/19)న :  రూ,48,600/-  స్కేలు 28940 – 78910
6. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.10.2020
      పై రెండు పద్దతుల్లో ఇంక్రిమెంట్ తేదీకి వేతన నిర్ణయం చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఇంక్రిమెంట్ తేదీ పాతదే అంటే అక్టోబర్ నెల కొనసాగుతుంది.
24 సంవత్సరాల స్కేలు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి  ఈ నిబంధన వర్తించదు. వారికి  ఎఫ్ ఆర్ 22ఎ(1)నిబంధన వర్తిస్తుంది. దాని వలన ఒక ఇంక్రిమెంట్ ప్రయోజనం లభిస్తుంది.
ఫండమెంటల్ రూల్సు (ఫిక్సేషన్లు-ఇంక్రిమెంట్లు):
ఒక ఉద్యోగి వేరొక పోస్టునందు నియమించబడి నప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్ రూల్స్ 22,30,31 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సందర్భంలో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండగనే ఈ నిబంధనల ప్రకారము వేతన స్థిరీకరణ చేయబడుతుంది. సెలక్షన్ గ్రేడు, 6/12/18/24 సంవత్సరముల స్కేల్సు, రివైజ్డ్ పే స్కేల్సు, మొ,, వానియందు ఆ విధంగానే వేతన స్థిరీకరణ చేయబడుచున్నది.
అట్లే ఉద్యోగి యొక్క సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు, ప్రీపోన్మెంటు, పోస్టు పోన్మెంటు మొదలుగునవి ఫండమెంటల్ రూల్పు 24, 26, 27ననుసరించి చేయబడతాయి.
F.R.22(a) (i): అదనపు బాధ్యతలతో కూడిన పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి ‘తదుపరి పై స్టేజి’ వద్ద వేతన స్థిరీకరణ జరుగును. అట్టి వేతన స్థిరీకరణ జరిగిన తేదీ నుండి 12 నెలల సర్వీసు నిండిన పిదప ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.gsr
ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 25,840/- వేతనము తీసుకొనే ఉద్యోగి 28,940 – 78,910 స్కేలు గల పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ. 28,940గా స్థిరీకరించబడుతుంది.
F.R.22(a) (ii): అదనపు బాధ్యతలు లేని పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి “దిగువస్టేజి’ వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే –
ఎ) ఒకవేళ పాత స్కేలులోని మూల వేతనమునకు సరిసమానమైన స్టేజి నూతన స్కేలులో వున్నచోఅట్టి ‘సమాన స్టేజి’ వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.
ఉదా: 21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు వేతనం పొందుతున్న ఉద్యోగి 28, 940 – 78,910  స్కేలు లో నియమించబడినప్పుడు అతని వేతనము రూ 30,580ల వద్దనే స్థిరీకరించబడుతుంది.
బి) ఒకవేళ పాత స్కేలులోని మూలవేతనమునకు సమానమైన స్టేజి లేనిచో దిగువ స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. వేతన వ్యత్యాసము ‘పర్సనల్ పే’గా నమోదు చేయబడుతుంది. పాతఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది. (93, 99, 05, 10, 15 స్కేళ్ళలో అన్నీ సమాన స్టేజీలే వుంటాయి.
సి) పాత స్కేలులోని మూలవేతనము నూతన స్కేలు యొక్క మినిమం కంటే తక్కువగా నున్నప్పుడు అట్టి మినిమం వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. సంవత్సరం సర్వీసు తదుపరి మాత్రమే ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.
ఉదా: రూ. 21,230-63,010 స్కేలులో రూ. 25,840/-లు పొందుచున్నచో, 28,940-78,910  స్కేలులో రూ. 28,940/- వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది.
F.R.22(a) (iv): ఉద్యోగి పబ్లిక్ సర్వీస్ కమీషన్ చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించబడినప్పుడు పాత పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము స్థిరీకరించబడుతుంది.
F.R.22 B: నిబంధన ననుసరించి వేతన స్థిరీకరణ రెండువిధములుగా చేయవచ్చును. వాస్తవ ప్రమోషన్ తేదీనాడైనను లేక ప్రమోషన్ పొందిన పిదప క్రింది పోస్టులోని తదుపరి ఇంక్రిమెంటుతేదీనాడైనను వేతన స్థిరీకరణ చేయవచ్చును.
జిఓ.ఎంఎస్.నం. 145, తేది. 19.05.2009 ప్రకారము ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండగనే ఉద్యోగికి ప్రయోజనకరమైన విధముగా ప్రమోషన్ తేదీ లేక తదుపరి ఇంక్రిమెంటు తేదీలలో దేనికైననూ వేతన నిర్ణయం చేయవలెను.
ఉదా: 21,230-63,010 స్కేలులో రూ. 28,120/-లు వేతనం పొందుతూ పదోన్నతి పొందినచో పదోన్నతి పొందిన రోజున వేతనం రూ. 28,940/-లుగా ఎస్ఆర్ 223(1) ప్రకారం నిర్ణయించి తదుపరి ఇంక్రిమెంటు తేదీ నాటికి ఒక నోషనల్ ఇంక్రిమెంటు రూ. 820/-లు కలిపి వేతనాన్ని రూ 28,940-78,910 స్కేలులో తదుపరి స్టేజి వద్ద అనగా రూ 30,580/-లుగా వేతన స్థిరీకరణ జరుగుతుంది.
FR 31 (2): నిబంధన ఎస్ఆర్ 22కు అనుబంధమైనది. దీని ప్రకారం సబ్ స్టాంటివ్ (క్రింది) పోస్టులో కొనసాగివుంటే ఇంక్రిమెంటు మంజూరు వలన గాని లేక ఇతర మంజూరుల వలనగాని ఆ స్కేలులోని వేతనము పెరిగినచో, అట్టి పెరుగుదల తేదీన అఫిషియేటింగ్ (పై) స్కేలులోని అతని వేతనము తదుపరి పై స్టేజి వద్ద పునస్థిరీకరణ చేయబడుతుంది. (లాభకరమైనప్పుడు)
ఉదా : *21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు పొందుచున్న ఉద్యోగి వేతనము 28,940 – 78,910  స్కేలులో రూ. 31,460/-ల వద్ద స్థిరీకరణ జరుగుతుంది. అయితే పాత స్కేలులోని ఇంక్రిమెంటు వలన వేతనము రూ. 31,460/-లుగా పెరుగుతుంది. కనుక సదరు ఇంక్రిమెంటు తేదీన క్రొత్త స్కేలులో అతని వేతనము 32,340/- వద్ద పున:స్థిరీకరణ చేయబడుతుంది.
F. R. 26:  నిబంధన ననుసరించి వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయబడును. వార్షిక ఇంక్రిమెంటు మంజూరుకు – ఒక పోస్టులోని డ్యూటీ కాలము, జీత నష్టములేని సెలవు కాలము, ఫారిన్ సర్వీసు కాలము, జాయినింగ్ కాలము మొదలగునవి లెక్కించబడతాయి. అనారోగ్య కారణముపై గాని, ఉన్నత శాస్త్ర, సాంకేతిక విద్యనసభ్యసించు కారణముపై గాని పెట్టిన జీతనష్టపుసెలవు 6 నెలల కాలపరిమితికి లోబడి ఇంక్రిమెంటుకు పరిగణించ బడుతుంది. అందుకుగాను సంబంధిత శాఖాధిపతి అనుమతిని పొందవలసి వుంటుంది. శిక్షా చర్యగా సస్పెండు చేయబడిన కాలము ఇంక్రిమెంటుకు లెక్కించబడదు.
FR 27: నిబంధన ననుసరించి *జూనియర్‌ కంటే సీనియర్ తక్కువ వేతనము పొందుచున్న సందర్భములో- ప్రీమెచ్యూర్ ఇంక్రిమెంట్ (ప్రీపోన్మెంట్) మంజూరు చేయబడుతుంది. ఒక పోస్టును మంజూరు చేయు అధికారియే అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయు అధికారము గలిగి యుండును.
అయితే ప్రభుత్వపు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సదరు అధికారము దాఖలు పరచబడిన సందర్భములో సంబంధిత క్రింది అధికారులు కూడా అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయవచ్చును.
ప్రీపోన్మెంట్ తోపాటు స్టెప్పింగ్ అప్ కూడా యీ నిబంధన క్రిందే చేయబడుతుంది.
F R 24: నిబంధన అనుసరించి దుష్ప్రవర్తన గల లేక అసంతృప్తికరమైన విధముగా విధులను నిర్వహించుచున్నట్టి ఉద్యోగిపై శిక్షా చర్యగా ఇంక్రిమెంటును కొంత కాలము నిలుపు చేయవచ్చును.
ఇంక్రిమెంటు మంజూరు చేయు అధికారియే అట్టి నిలుపుదల చేయవచ్చును. ఈ నిలుపుదల
రెండు విధములు – 1. క్యుములేటివ్ ఎఫెక్టుతో – అనగా ప్రతి సంవత్సరము నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.
2. క్యుములేటివ్ ఎఫెక్టు లేకుండా – అనగా ఆ ఒక్క సంవత్సరమునకు మాత్రమే నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.

How to Download Software in Excel Sheet in Google Drive? 

  • Click on the Download link 
  • Open Google Sheet 
  • Click on File on the Left Top Corner
  • Click on Download & Select Microsoft Excel

Related posts

AP Employees PRC 2022 AAS Software

TNUS .ORG

AP Employees SL EL Surrender Leave Bill Software

TNUS .ORG

AP Medical Reimbursement Proposals Software Latest for working, retire & death

TNUS .ORG

Leave a Comment

loader